Wednesday, May 6, 2020

కర్ణాటక ప్రజలు నిజం గా అదృష్టవంతులు.తరువాత మంత్రముగ్దులను దేవాలయాలు పశ్చిమ కనుమలు ఉన్నాయి. ఈ రాష్ట్రం లో పశ్చిమ కనుమలు ( వెస్ట్రన్ ఘాట్స్ ) ప్రత్యేక ఆకర్షణ. ఈ కనుమల లో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు వున్నాయి. శృంగేరి శారదాంబ టెంపుల్ , విద్యాశంకర టెంపుల్ , కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ , ధర్మస్థల మంజునాథ స్వామి టెంపుల్ , కొల్లూరు మూకాంబిక , కటీలు  దుర్గపరమేశ్వరి మరియు హొరనాడు అన్నపూర్ణ దేవి టెంపుల్ ఎంతో అద్భుతమైనవి.  ఇవే కాకా అగుంబే అనే అత్యధిక వర్ష పాతము కలిగిన ప్రదేశం మరియు జోగ్ ఫాల్స్ ( జోగు జలపాతము ) వున్నాయి.
ఈ టెంపుల్స్ అన్ని ఎంతో పరిశుభ్రం గా ఉంటాయి. కన్నడిగులు స్వతః గా శాంతి ప్రియులు మరియు ప్రక్రుతి ప్రేమికులు. వీరు టెంపుల్స్ లో శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కొంచెం క్రమశిక్షణ ఎక్కువ కావున ఆలయ దర్శనములో ఎంతో ఓపిక గా ఉండి తోపులాటలు కు తావు లేకుండా దర్శనం చేసుకోవచ్చు. 
  నేను ఇటీవల శృంగేరి ఆలయం సందర్శించి దేవతగా సరస్వతి దేవి నా అత్యంత ఇష్టమైన ఆలయంగా కనిపిస్తుంది. ఆలయ ప్రశాంతత మరియు నిర్మలమైన ఉంది.  

మా ప్రయాణము బెంగళూరు నుండి శృంగేరి వెళ్ళాము. మా ఇంటి నుండి మూడు వందల డెబ్భయి కిలో మీటర్ లు దూరం వుంది.  కార్ లో ప్రయాణము చేసేవారు ఈ రూట్ మ్యాప్ ను ఉపయోగించుకోవచ్చు. రూట్ మ్యాప్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.